- రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి
కామారెడ్డి టౌన్, వెలుగు: తప్పులు లేకుండా ఓటర్ల లిస్ట్రెడీ చేయాలని రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఓటరు నమోదు పోగ్రాం చేపడుతుందన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలు, ఫొటోలు మార్పుల వంటివి సరిచేసుకోవచ్చాన్నారు. బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ఇండ్లను పరిశీలించాలన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకే పోలింగ్ బూత్‌లో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని చెప్పాలన్నారు. గ్రాడ్యుయేట్, టీచర్ఎమ్మెల్సీకి సంబంధించి అర్హులైన వారిని ఓటర్లుగా ఎంట్రీ చేసుకునేలా చూడాలన్నారు. కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు రంగనాథ్‌రావు, ప్రభాకర్, తహసీల్దార్లు, ఎలక్షన్వింగ్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.బీఎల్వోకు సన్మానంపాల్వంచ మండలం వాడి పోలింగ్‌బూత్ స్థాయి అధికారి నిమ్మల లీలను రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. ఈమె సేవలు బాగున్నాయని భారత ఎన్నికల కమిషన్ అభినందించిందన్నారు.