మీరు ఎస్బీఐ ఖాతాదారులా.? అయితే మీకో గుడ్ న్యూస్. ఇకపై మీరు చేసే అన్ లైన్ ట్రాన్సాక్షన్స్ పై ఎలాంటి ఛార్జీలు పడవని ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా జరిపే లావాదేవీలపై విధించే చార్జీలను ఆగష్టు 1 నుంచి ఎత్తివేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
దీంతో ఎస్బీఐ కూడా తమ ఖాతాదారులకు పలు ప్రయోజనాలు అందించే దిశగా.. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వాడే వారికి ఎలాంటి రుసుము లేకుండా లావాదేవీలు జరిపే సదుపాయాన్ని కల్పించింది. ఇమిడియేట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్), నెఫ్ట్, ఆర్టీజీఎస్ లాంటి లావాదేవీలకు ఇది వర్తిస్తుందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. నెఫ్ట్ ద్వారా రూ.2 లక్షల వరకు పంపుకోనుండగా, అదే ఆర్టీజీఎస్ ద్వారా ఎంతైన పంపుకొనే సదుపాయాన్ని ఎస్బీఐ కల్పించనుంది.
Reuters: State Bank of India waives off IMPS, NEFT and RTGS charges pic.twitter.com/kP3czKbBVX
— ANI (@ANI) July 12, 2019
