IND vs BAN 2024: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కాన్పూర్ టెస్టుకు రెండో రోజు భారీ వర్షం

భారత్-బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ కు రెండో రోజు వర్షం అంతరాయం కలిగిస్తుంది. శనివారం(సెప్టెంబర్ 28) ఉదయం నుంచి భారీ వర్షం పడుతుంది. దీంతో పిచ్ పై కవర్లు కప్పి ఉంచారు. ఈ వేదికకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేకపోవడంతో ఈ మ్యాచ్ ప్రారంభం కావడం మరింత ఆలస్యం కావొచ్చు. ప్రస్తుతం వర్షం తగ్గినా కాసేపట్లో భారీ వర్ష సూచనలు ఉన్నాయి. రెండో రోజు మ్యాచ్ జరగడం కష్టంగానే కనిపిస్తుంది. 

వర్షం ఇంతకీ తగ్గకపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు హోటళ్లకు వెళ్లినట్టు సమాచారం. దీంతో మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు నిరాశ తప్పడం లేదు. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. వర్షం కారణంగా మూడో సెషన్ పూర్తిగా రద్దు చేయబడింది. ఇప్పటికే రెండో టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈ మ్యాచ్ రద్దయిత్ భారత్ కీలకమైన 6 పాయింట్లు కోల్పోనుంది. 

వర్షం అంతరాయం కలిగించడంతో మొదటి రోజు 35 ఓవర్ల మాత్రమే సాధ్యపడింది. రెండు జట్లు సంతృప్తికరంగా తొలి రోజును ముగించాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40), రహీం (6) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ కు రెండు.. అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది.