ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రపంచ క్రికెట్ లోనే ప్రమాదకర బౌలర్లలో ఒకడు. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా 2024 ఐపీఎల్ మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా 24.75 కోట్ల రూపాయలను ఖర్చు చేసి జట్టులోకి తీసుకుంది. లీగ్ మ్యాచ్ ల్లో చెత్త ప్రదర్శన చేసిన ఈ ఆసీస్ బౌలర్.. నాకౌట్ లో మాత్రం చెలరేగాడు. కేకేఆర్ టైటిల్ గెలవడంతో స్టార్క్ బౌలింగ్ ప్రధాన కారణం. అయితే అతన్ని ఐపీఎల్ 2025కి రిటైన్ చేసుకోకుండా కేకేఆర్ బిగ్ షాక్ ఇచ్చింది.
కేకేఆర్ యాజమాన్యం మాత్రం స్టార్క్ ను పక్కన పెట్టినందుకు కాస్త విచారపడాల్సిందే. స్టార్క్ ప్రస్తుతం పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి వన్డేలో అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో స్టార్క్ 10 ఓవర్లలో 33 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇందులో మూడు మేడిన్ ఓవర్లు ఉండడం విశేషం. తనదైన బౌలింగ్ తో కొత్త బంతితో ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ ను ఔట్ చేశాడు. స్టార్క్ మెగా ఆక్షన్ లోకి రానుండడంతో అతనికి భారీ ధర పలికే ఛాన్స్ ఉంది.
స్టార్క్ తో పాటు మిగిలిన ఆస్ట్రేలియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయింది. 44 పరుగులు చేసిన కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో బౌలర్ నజీమ్ షా 40 పరుగులు చేసి పాక్ స్కోర్ ను 200 పరుగులు దాటించాడు. 37 పరుగులు చేసి బాబర్ అజామ్ పర్వాలేదనిపించాడు.
MITCHELL STARC SHOW AT MCG ?
— Johns. (@CricCrazyJohns) November 4, 2024
3 for 33 from 10 overs against Pakistan in the first match - A beast in ODIs, one of the greatest ever in this format. pic.twitter.com/C4Tr3xysuW