తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హెల్త్‌‌‌‌ క్లెయిమ్స్‌‌‌‌ విలువ రూ. 3,330 కోట్లు

హైదరాబాద్, వెలుగు:  హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తెలుగు రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో రూ. 3,330 కోట్ల విలువైన క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చెల్లించినట్టు ప్రకటించింది. ఆంధ్ర, తెలంగాణలో తమకు దాదాపు 100 శాఖలు ఉన్నాయని తెలిపింది.  వచ్చే 4 సంవత్సరాల్లో తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల్లో 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 920 కోట్లను క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను చెల్లించామని చెప్పారు.  ప్రతి నిమిషానికి 4 క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల చొప్పున ఆమోదిస్తూ, కంపెనీ ప్రతి రోజూ రూ. 25 కోట్ల విలువ చేసే క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రాసెస్ చేస్తుందని వివరించారు.  కొత్తగా  హోమ్ హెల్త్ కేర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆరంభించినట్టు వెల్లడించారు.