న్యూఢిల్లీ: బీహార్ లో దారుణం జరిగింది. ఎనిమిదో క్లాస్ చదువుతున్నామెను ఓ యువకుడు సెకన్ల వ్యవధిలోనే 8 సార్లు కత్తితో పొడిచాడు. ఈ నెల 19న గోపాల్గంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా వెంబడించిన దుండగుడు ఉన్నట్టుండి కత్తితో దాడి చేశాడు. 13 సెకన్లలోనే 8 సార్లు కత్తితో పొడిచాడు. ఒక వ్యక్తి అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా విడిచిపెట్టకుండా ఆమెపై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. కొద్దిరోజులుగా స్కూల్కు వెళ్లేటప్పుడు నిందితుడు వేధిస్తున్నాడని, తిరగబడ్డానని తను చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీడియో ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. బాలిక ప్రస్తుతం పాట్నా మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ పొందుతోంది.
