జయలలిత మృతి మిస్టరీ చేధిస్తాం

జయలలిత మృతి మిస్టరీ చేధిస్తాం

ఏప్రిల్‌ 6వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో..ప్రచారం స్పీడప్ చేశారు పలు పార్టీల నేతలు. ఇందులో భాగంగనే డీఎంకే అధినేత స్టాలిన్‌ సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే అమ్మ..జయలలిత మృతి వెనుక ఉన్న రహాస్యాలను చేధిస్తామని ప్రకటించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రోయపురంలో నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్‌ ఈ ప్రకటన చేశారు. అంతేకాదు..పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం జయలలిత మృతి విషయంలో వాస్తవాలు చెప్పడం లేదని ఆరోపించారు. అమ్మ మృతి వెనుక ఉన్న మిస్టరీని చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ ఎన్నికల మేనిఫెస్టోను అన్నాడీఎంకే కాపీ కొట్టిందని విమర్శించారు.

234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 6వ తేదీన పోలింగ్‌ జరగనుంది. నామినేషన్‌ దాఖలుకు ఆఖరు తేదీ మార్చి 19, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 22 వరకు అవకాశం ఉంది.