రీసెంట్ గా కరోనా నుండి క్షేమంగా బయటపడిన కమల్ హాసన్ కు స్టాలిన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కమల్ ..తమిళ్ బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కారణంగా రెండు వారాలపాటు బిగ్ బాస్ షో కు దూరమయ్యారు. కరోనా కోలుకున్న వెంటనే షో కు హాజరవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది స్టాలిన్ సర్కార్.
జాతీయ విపత్తుల చట్టం ప్రకారం… కమల్ హాసన్ కు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. కమల్ హాసన్ నవంబర్ 22 వ తేదీన కరోనా బారిన పడ్డారు. దీంతో కమల్ హాసన్ ను చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ లో కరోనా చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు ఆయను కుటుంబ సభ్యులు. దాదాపు 10 రోజుల పాటు చికిత్స పొందిన కమల్ హాసన్ …. రెండు రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్ అయిన వెంటనే షో కు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు జారీచేశారు.
