ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : ఎస్సై కుర్మయ్య

నర్వ, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఉందేకోడ్, జంగంరెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం సాయంత్రం కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎస్సై కుర్మయ్య మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రతకు భరోసా కల్పించడానికి కవాతు నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.