శ్రీతేజ్ హెల్త్ అప్ డేట్.. వెంటిలెటర్ లేకుండానే ఊపిరి తీసుకుంటుండు

 సంధ్య థియేటర తొక్కిసలాటలో గాయపడ్డ  బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు కిమ్స్ వైద్యులు.   శ్రీతేజ్ ఎటువంటి ఆక్సిజన్  కానీ వెంటిలేటరీ సపోర్ట్ లేకుండా ఊపిరి తీసుకుంటున్నాడని తెలిపారు.  అతను అప్పుడప్పుడు కళ్లు తెరుస్తున్నాడు కానీ.. ఐ కాంటాక్ట్ కానీ..కుటుంబ సభ్యులను గుర్తు పట్టడం లాంటివి కానీ చేయడం లేదని వెల్లడించారు. సైగలను గమనిస్తున్నాడు కానీ..మాటలను అర్థం చేసుకోలేకపోతున్నాడని తెలిపారు.  నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ ద్వారా ఫుడ్ ను అందిస్తున్నామని చెప్పారు డాక్టర్లు. 

డిసెంబర్ 4న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోయిన సంగతి తెలిసిందే.. ఈ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ అప్పటి నుంచి అంటే  20 రోజులుగా ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. శ్రీతేజ్ చికిత్సకు సంబంధించి ఖర్చును  ప్రభుత్వం భరిస్తోంది. 

ALSO READ | జైలులో కనీసం టూత్ బ్రష్, సబ్బు కూడా ఇవ్వరు: నటి కస్తూరి

తొక్కిసలాటల కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ కేసులో  18 మంది నిందితులను చేర్చారు పోలీసులు. ఈ కేసులో  అల్లు అర్జున్ ను  ఏ11 గా చేర్చిన పోలీసులు.. ఏ 18గా పుష్ఫ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతలను చేర్చారు. ఏ1 నుంచి   ఏ8 వరకు థియేటర్ యజమానులు, మేనజర్ ను చేర్చారు. ఏ9 ,ఏ 10 గా  సంధ్య థియేటర్  సెక్యూరిటీ, మేనేజర్ ను చేర్చారు. ఏ 11 నుంచి ఏ 17 వరకు అల్లు అర్జున్, బౌన్సర్, సెక్యూరిటీ పేర్లను చేర్చారు. 

డిసెంబర్ 24న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ను దాదాపు మూడున్నర గంటలు విచారించారు.  దాదాపు 20 ప్రశ్నలకు అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు.