శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు.. పెరిగిన నీటి మట్టం

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటి మట్టాన్ని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో: 57,171 క్యూసెక్కులుగా ఉన్నట్లు చెప్పారు. ఔట్ ఫ్లో: నిల్ గా ఉందన్నారు. కాగా పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం నీరు 811.50 అడుగులు ఉన్నట్లు తెలిపారు.

పూర్తిస్థాయి నీటి నిల్వ  215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35.1774 టీఎంసీలు వరద నీరు వచ్చి చేరినట్లు తెలిపారు. మరోవైపు వరద పోటెత్తుతుండడంతో కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు వెల్లడించారు.