మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.ఆ రోజుల్లో అన్ని ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు వేలాదిగా తరలి వస్తారని, కాబట్టి స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని కోరారు .మార్చి 1వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు తెలిపిన ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు
శివస్వాములకు మాత్రం 1వ తేదీ నుంచి 5న సాయంత్రం వరకు నిర్దిష్ట వేళ్లలో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 5న రాత్రి 7.30 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కు ఏర్పాట్లు చేసినట్టు ఈవో పేర్కొన్నారు.
జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని ఈవో తెలిపారు. 5వ తేదీన సాయంత్రం 7:30 నుండి 11 గంటల వరకు వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కి ఏర్పాట్లు చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు.
ద్వాదశ జోతిర్లింగాలలో రెండవది ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్రమైన క్షేత్రం శ్రీశైలం. దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో సముద్రమట్టానికి 500 అడుగుల ఎత్తులో కొలువైన శివయ్య క్షేత్రం. సాక్షాత్తు ఆ పరమశివుడు స్వయంబుగా వెలసిన మరో భూకైలాసం ఈ శ్రీశైలం.మనిషి జీవితానికి మోక్షం కలిగించే కాశీ పుణ్యక్షేత్రం అంతటి విశిష్టత గంగా నదిలో 5000 సార్లు మునిగేతే వచ్చేంత పుణ్య ఫలం శ్రీశైలం క్షేత్రం దర్శనం అని భక్తు విశ్వాసం. అలాంటి మహా పుణ్యక్షేత్రంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయానికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల స్వామివారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డి పెద్దిరాజు తెలిపారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారికి ఇది వరకు వెండి రథంతోనే ఊరేగింపు ఉత్సవాలు నిర్వహించేవారు. ఇటీవల నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వామి అమ్మవార్ల ఉత్సవాలను నిర్వహించేందుకు సుమారు 11 కోట్ల విలువచేసే బంగారు రథాన్ని అందించారు. ఇకపై స్వామి అమ్మ వాళ్ళ ఉత్సవాలను బంగారు రథం పై నిర్వహించనున్నారు.