తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు : మంత్రి జూపల్లి కృష్ణారావు

  • మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: రాష్ట్రంలో టూరిజం అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ మండలం నల్లమలలోని సోమశిలలో శుక్రవారం మంత్రి పర్యటించి, టూరిజం శాఖకు సంబంధించిన లాంచీ, కాటేజీలను పరిశీలించారు. లాంచీ డ్రైవింగ్ చేస్తూసంబంధిత అధికారులతో కృష్ణానదిలో విహరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఏసీ లాంచీ సిద్ధంగా ఉందన్నారు. లాంచీ ప్రయాణం పర్యాటకుల హృదయాలను కట్టిపడేస్తుందని తెలిపారు. నాగార్జునసాగర్, కిన్నెరసాని పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. 

నేటి నుంచి లాంచీ ప్రారంభం

సోమశిల:  శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్యాకేజీ వివరాలను టూరిజం శాఖ అధికారులు ప్రకటించారు. వన్ వే ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, చిన్న పిల్లలకు రూ.1,600. రానుపోను ప్రయాణానికి పెద్దలకు రూ.3 వేలు, చిన్నపిల్లలకు రూ.2,400 టికెట్  ఉంటుందని పేర్కొన్నారు.  ప్రయాణికులకు మధ్యాహ్నం భోజనం వసతి కల్పించనున్నారు. శనివారం నుంచి ఆన్ లైన్ లో టికెట్లు బుక్  చేసుకోవచ్చు. లాంచీ ప్రయాణ వివరాలు, టికెట్ల బుకింగ్ కు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు 7731854994 నంబర్​లో సంప్రదించవచ్చు.