కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యామ్ కు వరద కొనసాగుతోంది. వడివడిగా డ్యామ్ లో నీటి మట్టం పెరుగుతోంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 838.30 అడుగులుగా ఉంది.
-పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.80 టీఎంసీలు
-ప్రస్తుత నీటి నిల్వ : 59.3974 టీఎంసీలు
-ఇన్ ఫ్లో.. 1 లక్ష , 98 వేల 789 క్యూసెక్కులు..
-ఔట్ ఫ్లో : నిల్ (2400 క్యూసెక్కులు కల్వకుర్తి పథకానికి విడుదల)
కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో పీక్ లోడ్ అవర్స్ లో డిమాండ్ ని బట్టి పరిమితంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు.
