Sri Rama Navami Special: రామయ్య అనుగ్రహం కోసం...శ్రీరామనవమి రోజు ఇలా చేయండి..

ఏక పత్నీ వ్రతుడు.. దశరథ తనయుడు .. ధర్మ వాక్ పరిపాలకుడు.. పరిపాలనా మార్గదర్శకుడు..  భగవాన్ శ్రీరామచంద్రుని అనుగ్రహం కోసం భక్తులు పూజలు చేస్తుంటారు. శ్రీరాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామ నవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం 2024 లో శ్రీ రామ నవమి ఏప్రిల్ 17 న జరుపుకోనున్నారు. శ్రీ రాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు, నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. శ్రీ రామ నవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో పూర్తి భక్తి, విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు.  

భారతదేశంలోని దాదాపు ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది.  అయితే చైత్రమాసం శుద్ద నవమి రోజున  అనగా శ్రీరామ నవమి రోజున ప్రతి గ్రామంలో... పెద్ద గ్రామాలైతే ప్రతి వీధిలో రాముని కల్యాణం జరుపుతారు.  ఇక భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తారు.   హిందూ మతంలో శ్రీ రాముడి పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం , భక్తి ఉంటుంది. 

శ్రీ రామ నవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడింది. ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా..  జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదో తేదీన పవిత్రమైన రామ నవమిని జరుపుకుంటారు. రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామ నవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం 2024 లో శ్రీ రామ నవమి ఏప్రిల్ 17 న జరుపుకోనున్నారు. శ్రీ రాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు, నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. రామ నవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో పూర్తి భక్తి, విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు.

శ్రీ రామ నవమి 2024 శుభ సమయం

2024 సంవత్సరంలో శ్రీ రామ నవమి ఏప్రిల్ 17, బుధవారం వచ్చింది. పూజ శుభ సమయం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:38 వరకు. అటువంటి పరిస్థితిలో పూజకు సమయం 2 గంటల 35 నిమిషాలు ఉంటుంది. నవమి తిథి 16 ఏప్రిల్ 2024న మధ్యాహ్నం 1:23 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం 3:14 గంటలకు ముగుస్తుంది.

శ్రీ రామనవమి రోజు సాయంత్రం ఇలా చేయండి..

ధనలాభం కోసం : ఆర్థిక లాభం కోసం, రామ నవమి సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకుని రామరక్షా మంత్రాన్ని ‘ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః’ 108 సార్లు జపించండి. ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లండి.

సంతానం కోసం: కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి, ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.

ఆనందం, శాంతి కోసం: దేవాలయం ధ్వజస్థంభం ఎదురుగా  నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి, ‘శ్రీరామ్ జై రామ్ జై జై రామ్’ అని 108 సార్లు జపించండి.

ఆరోగ్యం కోసం : శ్రీ రామ నవమి సాయంత్రం ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించి, ‘ఓం హనుమతే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.

వివాహంలో అడ్డంకులను తొలగిపోవడానికి : శ్రీ రామ నవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించి, ‘ఓం జై సీతా రామ్’ అని 108 సార్లు జపించండి.

శ్రీ రామ నవమి రోజున చేయకూడని పనులు

శ్రీ రామనవమి రోజున మీరు తీసుకున్న చర్యల ఫలితాలు త్వరగా పొందాలంటే శ్రీ రామనవమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు.  రామ నవమి రోజున తామసిక ఆహారం, మాంసం, మద్యం మొదలైన వాటిని అస్సలు తీసుకోకండి. మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి. ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి. కోపానికి, అబద్ధాలకు,  చెడుకు దూరంగా ఉండండి. ఎవరికీ హాని చేయకండి. అందరితో ప్రేమగా నడుచుకోండి.