హైదరాబాద్, వెలుగు: తెలంగాణ డిగ్రీ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ బి. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. టీజీసీటీఏ యూనియన్ ఎన్నికలు ఉస్మానియా వర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్లో జరిగాయి. సెక్రటరీ జనరల్‌గా బ్రిజేశ్ కుమార్, చైర్మన్ గా సౌందర్య జోసెఫ్, ఉమెన్స్ సెక్రటరీగా ఎం. భవాని, అకడమిక్ సెక్రటరీగా గోపాల్ సుదర్శన్, ఫైనాన్స్ సెక్రటరీగా డాక్టర్ గంగాధర్ నియమితులయ్యారు.
వైస్ ప్రెసిడెంట్లుగా ఆడెపు రమేష్, ఎం. జగన్, సెక్రటరీగా హరీష్ కుమార్, రామాచారి ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీ జనరల్ బ్రిజేశ్ మాట్లాడారు. హయ్యర్ ఎడ్యుకేషన్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీతో పాటు అడ్మిషన్ల పెంపునకు కృషి చేస్తామని పేర్కొన్నారు.