శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్​పీపీ ఘన విజయం

  • ప్రెసిడెంట్ దిస్సనాయకే నేతృత్వంలోని కూటమికి 159 సీట్లు

కొలంబో: శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్ పీపీ) కూటమి ఘన విజయం సాధించింది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించింది. మొత్తం 225 పార్లమెంట్ సీట్లు ఉండగా, ఎన్ పీపీ 159 సీట్లు గెలుచుకుంది. పోలైన ఓట్లలో 61 శాతం దక్కించుకుంది.

శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఆ దేశ ఎలక్షన్ కమిషన్ శుక్రవారం వెల్లడించింది. సాజిత్ ప్రేమదాస నేతృత్వంలోని సామగి జన బలవేగాయ పార్టీ 40 సీట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇలంకై తమిళ్ అరసు కచ్చి పార్టీ 8 సీట్లు, న్యూ డెమోక్రటిక్ ఫ్రంట్ 5, శ్రీలంక పొదుజన పెరమున 3, శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ 3 సీట్ల చొప్పున గెలుచుకున్నాయి.