నర్సాయపల్లిలో రేణుక ఎల్లమ్మ పండగ

చేర్యాల, వెలుగు:  మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో కొమ్మూరి సంస్థానం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా కొనసాగుతున్న పండుగ చివరి రోజైన మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.

జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా జోగిని శ్యామలను బోనమెత్తేందుకు ఆహ్వనించారు. జోగిని శ్యామల బోనమెత్తి శివమెత్తి ఊరంతా తిరిగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో కొమ్మూరి కుటుంబ సభ్యులు ప్రశాంత్​రెడ్డి, రాకేశ్​రెడ్డి ఉన్నారు.