Sri Lanka vs New Zealand: ఓటమి దిశగా న్యూజిలాండ్‌‌‌‌

గాలె: శ్రీలంకతో రెండో టెస్ట్‌‌‌‌లో న్యూజిలాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. 22/2 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో శనివారం మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 39.5 ఓవర్లలో 88 రన్స్‌‌‌‌కే  ఆలౌటైంది. మిచెల్‌‌‌‌ శాంట్నర్‌‌‌‌ (29) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ (13), రచిన్‌‌‌‌ రవీంద్ర (10)తో సహా అందరూ ఫెయిలయ్యారు. ప్రభాత్‌‌‌‌ జయసూర్య 6, నిశాన్‌‌‌‌ పీరిస్‌‌‌‌ 3 వికెట్లు తీశారు.

 తర్వాత ఫాలో ఆన్‌‌‌‌లో రెండో ఇన్నింగ్స్‌‌‌‌ మొదలుపెట్టిన కివీస్‌‌‌‌ ఆట ముగిసే టైమ్‌‌‌‌కు 41 ఓవర్లలో 199/5 స్కోరు చేసింది. టామ్‌‌‌‌ బ్లండెల్‌‌‌‌ (47 బ్యాటింగ్‌‌‌‌), గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ (32 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. డేవన్‌‌‌‌ కాన్వే (61), విలియమ్సన్‌‌‌‌ (46) ఫర్వాలేదనిపించారు.  నిశాన్‌‌‌‌ పీరిస్‌‌‌‌ 3 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం కివీస్‌‌‌‌ ఇంకా 315 రన్స్‌‌‌‌ వెనకబడి ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది.