ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతున్న శ్రీలంకలో శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇంటిని వదిలి పారిపోయినట్లు అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. రాజీనామా చేయాలంటూ నిరసనకారులు ఇంటిని చుట్టుముట్టడంతో.. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు కథనంలో పేర్కొన్నారు. పోలీసులు వెంటనే నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స పారిపోయిన విషయాన్ని శ్రీలంక రక్షణ శాఖ కూడా ధ్రువీకరించినట్లు కథనాల్లో ప్రస్తావించారు. గతంలో కూడా అప్పటి ప్రధాని మహింద రాజపక్స ఇంటిని నిరసనకారులు ఇలాగే చుట్టుముట్టారు. దీంతో ఆయన కూడా అప్పట్లో ఇలాగే పారిపోయారు.
