SL vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. శ్రీలంక జట్టులో ఐదు మార్పులు

సాధారణంగా తుది జట్టులో ఒకటి రెండు మార్పులు చేయడం సహజం. కానీ న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో మాత్రం  శ్రీలంక ఏకంగా 5 మార్పులతో బరిలోకి దిగింది. మంగళవారం (నవంబర్ 19) పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం జరుగుతున్న న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఆతిధ్య కెప్టెన్ అసలంక జట్టులో 5 మార్పులు చేస్తున్నట్టు తెలిపాడు. ఇప్పటికే సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో గెలిచిన శ్రీలంక బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. 

ALSO REA D | AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే

ఓపెనర్ పాతుమ్ నిస్సంకా, కుశాల్ మెండీస్, వెల్లలాగే, కామిందు మెండీస్, అసిత ఫెర్నాన్దో లకు ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చారు. వీరి స్థానంలో  నిషాన్ మదుష్కా,నువానీడు ఫెర్నాండో,చమిందు విక్రమసింఘే,దిల్షాన్ మధుశంక,మహ్మద్ షిరాజ్ జట్టులోకి వచ్చారు. స్టార్ ప్లేయర్లను పక్కన పెట్డంతో శ్రీలంక తడబడింది. కివీస్ చక్కగా ఆడడంతో ప్రస్తుతం 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం పెద్దదిగా పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. 

రాబిన్సన్ 9 పరుగులు చేసి విఫలమయ్యాడు. యంగ్ హాఫ్ సెంచరీతో ఆదుకోగా.. నికోల్స్ 46 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వీరిద్దరి జోడీ రెండో వికెట్ కు 106 బంతుల్లో 88 పరుగులు చేసి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. మహ్మద్ షిరాజ్ కు ఏకైక వికెట్ దక్కింది.