గాలే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక పట్టు బిగిస్తుంది. మొదట బ్యాటింగ్ లో.. ఆ తర్వాత బౌలింగ్ లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. బ్యాటర్లు విజ్రంభించడంతో తొలి ఇన్నింగ్స్ లో 602 పరుగుల భారీ చేసిన శ్రీలంక.. బౌలింగ్ లో అంతకు మించి రాణించింది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ను కేవలం 88 పరుగులకే ఆలౌట్ చేసింది. 29 పరుగులు చేసిన సాంట్నర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్యకు 6 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్ర బౌలర్ నిషాన్ పీరిస్ కు మూడు వికెట్లు దక్కాయి. అసిత ఫెర్నాండోకు ఒక వికెట్ లభించింది.
2 వికెట్ల నష్టానికి 22 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్.. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. ప్రభాత్ జయసూర్య, నిషాన్ పీరిస్ దెబ్బకు జట్టు ఏ దశలోనూ కోలుకుపోలేకపోయింది. కేవలం 88 పరుగులకే కుప్పకూలడంతో ఆతిధ్య జట్టు లంకకు 514 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతున్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 3 పరుగులు చేసింది. టామ్ లేతమ్ డకౌటయ్యాడు. ప్రస్తుతం కివీస్ 511 పరుగులు వెనకబడి ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో ఈ మ్యాచ్ లో లంక విజయం లాంఛనంగా కనిపిస్తుంది.
Also Read:-ఐదు బంతుల్లో నాలుగు సిక్సర్లు
తొలి ఇన్నింగ్స్ లో కమింద్ మెండిస్ (182 నాటౌట్), దినేష్ చండీమల్ (116) కుశాల్ మెండిస్ (106 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో.. శుక్రవారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌ను 163.4 ఓవర్లలో 602/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 306/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన లంక ఇన్నింగ్స్‌లో కమింద్.. మాథ్యూస్ (88) తో నాలుగో వికెట్‌కు 107, ధనంజయ (44)తో ఐదో వికెట్‌కు 74 రన్స్ జోడించాడు. చివర్లో కుశాల్, కమింద్ ఆరో వికెట్‌కు 200 రన్స్ జత చేసి భారీ స్కోరు అందించారు.
The misery continues for New Zealand in Galle, who are forced to follow-on trailing by over 500 runs ?#SLvNZ https://t.co/mD2JJ1pyh5 pic.twitter.com/fVK1JbDvdp
— ESPNcricinfo (@ESPNcricinfo) September 28, 2024