కమిందు సెంచరీ.. శ్రీలంక 302/7

గాలె (శ్రీలంక): మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్ కమిందు మెండిస్ (114) సెంచరీతో ఆదుకోవడంతో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక తడబడి తేరుకుంది. బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన లంక 302/7 స్కోరుతో తొలి రోజు ముగించింది. 

ఓపెనర్ దిముత్ కరుణరత్నే (2) నిరాశపరచగా, పాథుమ్ నిశాంక (27), దినేశ్ చండిమల్ (30), ఏంజెలో మాథ్యూస్ (36), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (11) తక్కువ స్కోర్లకే ఔటవడంతో  లంక 106/4తో కష్టాల్లో పడింది.  ఈ దశలో కుశాల్ మెండిస్ (50)తో కలిసి కమిందు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దాడు.  ప్రస్తుతం రమేశ్ మెండిస్ (14 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ప్రభాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయసూర్య (0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఒరొర్క్ మూడు, గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లు తీశారు.