రిటెన్షన్‎లో సన్ రైజర్స్ ఆటగాడే తోప్.. కోహ్లీ, రోహిత్, ధోనిని మించి..

2025 ఐపీఎల్ సీజన్ కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను అన్ని ఫ్రాంచైజ్‎లు వెల్లడించాయి. రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్‎ను విడుదల చేసేందుకు ఇవాళే (అక్టోబర్ 31) చివరి రోజు కావడంతో అన్ని జట్ల యజమాన్యాలు.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు, వదిలేసుకున్న ప్లేయర్ల జాబితాను ప్రకటించాయి. దీంతో పాటుగా రిటెన్షన్ చేసుకున్న ఆటగాడికి ఎంత చెల్లించాయని వివరాలను సైతం ఫ్రాంచైజ్‎లు వెల్లడించాయి. రిటెన్షన్ పాలసీలో సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్ క్లాసెన్ జాక్ పాట్ కొట్టాడు.

గత సీజన్‎లో అద్భుత ప్రదర్శనతో సన్ రైజర్స్‎ను ఫైనల్‎కు చేర్చిన క్లాసెన్‎ను వచ్చే సీజన్ కోసం అట్టిపెట్టుకున్న ఎస్ఆర్‎హెచ్.. క్లాసెన్‎కు ఏకంగా రూ.23 కోట్లు చెల్లించనుంది. దీంతో రిటెన్షన్ పాలసీలో క్లాసెన్ టాప్ ప్లేయర్‎గా నిలిచాడు. టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని, జస్ప్రీత్ బుమ్రా, హర్ధిక్ పాండ్యాలను వెనక్కి నెట్టి రిటెన్షన్ పాలసీలో క్లాసెన్ అగ్రస్థానంలో నిలిచాడు. 

ALSO READ | IPL Retention 2025: క్లాసెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జాక్ పాట్.. సన్ రైజర్స్ రిటైన్ ప్లేయర్లు వీరే

విరాట్ కోహ్లీకి ఆర్సీబీ రూ.21 కోట్లు, రోహిత్‎కు ముంబై రూ.16 కోట్లు, ధోనీకి చెన్నై రూ.4 కోట్లు, పాండ్యా రూ.16.35, బుమ్రా రూ.18 కోట్లు ముంబై చెల్లించింది. లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు చెల్లించి నికోలస్ పూరన్ వచ్చే సీజన్ కోసం అట్టిపెట్టుకుంది. దీంతో రిటెన్షన్ పాలసీలో ఎస్ఆర్‎హెచ్ విధ్వంసకర బ్యాటర్ టాప్‎లో నిలిచాడు. మొత్తానికి ఇవాళ్టితో  జట్లు రిటెన్షన్ చేసుకునే ప్లేయర్లు ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఇక, ప్రియుల ఫోకస్ అంతా నవంబర్ చివరన లేదా డిసెంబర్‎లో జరగనున్న మెగా వేలంపై ఉండనుంది.