IPL Retention 2025: ఐదుగురి కోసం రూ.75కోట్లు.. సన్ రైజర్స్ రిటైన్ ప్లేయర్స్ లాక్

ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 రూల్స్ వచ్చేశాయి. అన్ని జట్లు తమ ప్లేయర్లను రిటైన్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఇందులో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటైన్‌ చేసుకొనే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసింది. అసలు విషయానికి వస్తే దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసన్ కోసం ఏకంగా రూ. 23 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈఎస్పిన్  క్రిక్ ఇన్ఫో, క్రిక్ బజ్  నివేదించడంతో ఇది దాదాపుగా నిజం అనిపిస్తుంది. రేపు (అక్టోబర్ 31) అధికారిక ప్రకటన రానుంది.

క్లాసన్ సన్ రైజర్స్ తరపున రెండు సీజన్ లు గా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. జట్టులో మిగిలిన ఆటగాళ్లు విఫలమైనా ఒక్కడే వారియర్ లా పోరాడిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి. దీంతో ఈ సఫారీ ఆటగాడికి అన్ని కోట్లు ఇవ్వడంలో న్యాయం ఉందంటున్నారు నెటిజన్స్. క్లాసన్ తో పాటుగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్, భారత యువ సంచలనం అభిషేక్ శర్మను రిటైన్ చేసుకోనుంది. కమ్మిన్స్ కు రూ. 18 కోట్లు.. అభిషేక్ శర్మకు రూ. 14 కోట్లు ఇవ్వనుంది.  

ALSO READ | ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్.. బుమ్రాను వెనక్కి నెట్టి నెం.1 బౌలర్‌గా సఫారీ స్పీడ్ స్టార్

2024 ఐపీఎల్ లో కమ్మిన్స్ తన కెప్టెన్సీతో జట్టును ఫైనల్ కు చేర్చాడు. దీంతో మరోసారి సన్ రైజర్స్ యాజమాన్యం నమ్మింది. అభిషేక్ శర్మ ఐపీఎల్ తో పాటు టీమిండియా తరపున మెరుపు ఇన్నింగ్స్ లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురితో పాటుగా ఐపీఎల్ 2024 సీజన్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియన్ పవర్ హిట్టర్ ట్రావిస్ హెడ్, భారత యంగ్‌ ఆల్‌రౌండర్‌ నితీష్ కుమార్ రెడ్డి కూడా సన్ రైజర్స్ జట్టులో కొనసాగనున్నారు. హెడ్ కు రూ. 14 కోట్లు.. నితీష్ కుమార్ కు రూ. 6 కోట్లు ఇవ్వనున్నారు. రూల్స్ ప్రకారం మొదటి 5 ప్లేయర్లకు రూ. 75 కోట్లు చెల్లించాలి. దీంతో సన్ రైజర్స్ ఆక్షన్ లోకి రూ. 45 కోట్ల రూపాయలతో వెళ్లనుంది.