IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే

రెండు రోజులపాటు అభిమానులను అలరించిన ఐపీఎల్ మెగా వేలం విజయవంతంగా ముగిసింది. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజ్‎లు కోట్లు కుమ్మరించాయి. ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) యాజమాన్యం తమ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేసిందని చెప్పుకోవాలి. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ సేవలను కోల్పోయినప్పటికీ, అతని స్థానంలో ప్రధాన పేసర్ మహ్మద్ షమీని చేజిక్కించుకోవడం మంచి ఎంపిక అనుకోవాలి.

పర్పుల్ క్యాప్ విజేత.. 

ఐపీఎల్ హిస్టరీలో రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేత హర్షల్ పటేల్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేయడం సరైన నిర్ణయం అనుకోవచ్చు. చివరిలో ఓవర్లలో స్లో బాల్స్‌తో కట్టడి చేయగల హర్షల్ పటేల్‌ కోసం కావ్య మారన్.. రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో చెన్నై మాజీ ఫాస్ట్ బౌలర్ సిమర్‌జీత్ సింగ్‌ను 1.5 కోట్లకు. ఎషాన్ మలింగను 1.2 కోట్లకు కొనుగోలు చేసింది.

Also Read : ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

  • హెన్రిచ్ క్లాసెన్: రూ. 23 కోట్లు (దక్షిణాఫ్రికా, బ్యాటర్/ వికెట్ కీపర్
  • పాట్ కమిన్స్: రూ. 18 కోట్లు (కెప్టెన్, ఆస్ట్రేలియా బౌలర్)
  • అభిషేక్ శర్మ: రూ. 14 కోట్లు
  • ట్రావిస్ హెడ్: రూ. 14 కోట్లు (ఆస్ట్రేలియా బ్యాటర్)
  • నితీష్ కుమార్ రెడ్డి: రూ.6 కోట్లు

కొత్తగా కొనుగోలు చేసిన ఆటగాళ్లు 

  • మహ్మద్ షమీ: రూ.10 కోట్లు
  • హర్షల్ పటేల్: రూ.8 కోట్లు
  • ఇషాన్ కిషన్: 11.25 కోట్లు
  • రాహుల్ చాహర్: 3.2 కోట్లు
  • ఆడమ్ జంపా: రూ.2.4 కోట్లు (ఆస్ట్రేలియా స్పిన్నర్)
  • అథర్వ తైదే: రూ.30 లక్షలు 
  • అభినవ్ మనోహర్: రూ.3.2 కోట్లు
  • సిమర్‌జీత్ సింగ్: రూ.1.5 కోట్లు
  • జీషన్ అన్సారీ: రూ. 40 లక్షలు 
  • జయదేవ్ ఉనద్కత్: కోటి రూపాయలు 
  • బ్రైడన్ కార్సే.. కోటి రూపాయలు (ఇంగ్లండ్ బౌలర్
  • కమిందు మెండిస్:  రూ. 75 లక్షలు (శ్రీలంక ఆల్ రౌండర్)
  • అనికేత్ వర్మ: రూ. 30 లక్షలు
  • ఎషాన్ మలింగ: రూ.1.2 కోట్లు (శ్రీలంక బౌలర్)
  • సచిన్ బేబీ: రూ. 30 లక్షలు