శ్రావణమాసం.. కోర్కెలు తీర్చే మాసం.. ఇలా పూజలు చేయండి

శ్రావణం మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన నెల. శ్రావణ మాసాన్ని పరమేశ్వరుడికి అంకితం చేస్తారు. ఈ నెలలో శివారాధాన వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.హిందువులు ఉపవాసాలు కూడా పాటిస్తారు. దైవ పూజ, వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. 

శ్రావణ మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇంతటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన శ్రావణమాసంలో చేసే పనులతో సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా దంపతుల మధ్య ప్రేమాభిమానాలు పెరగాలంటే శివుడి అనుగ్రహం కచ్చితంగా కావాల్సిందే. శివుడాజ్ఞ లేదిని చీమైనా పుట్టదు అంటారు.. అలాగే దంపతులు సంతోషమైన జీవితానికి కూడా ఆయన ఆజ్ఞ కావాల్సిందే. శ్రావణ మాసంలో ఆయనను స్మరించుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు వివాహ సమస్యలు ఎదుర్కున్నా ఈ పూజలు చేస్తే కచ్చితంగా దోషం పోతుంది. 
వెంటనే పెళ్లి అవుతుంది. 

 కోరుకున్న భాగస్వామిని పొందడానికి: స్వచ్ఛమైన నీటిలో కొన్ని పాలు, కుంకుమ, ఎరుపు రంగు పువ్వులు వేసి బుధవారం రోజు శివలింగానికి సమర్పించాలి. ఇలా చేస్తే కోరుకున్న భాగస్వామిని పొందుతారు. అలాగే సోమవారం కూడా ఉపవాసం ఉండటం మరింత మంచిది. ఇలా చేస్తే పార్వతీ దేవి, శివుడిని ప్రసన్నం అవుతారు.

 వివాదాల పరిష్కారానికి:  భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువైతే.. శ్రావణ మాసంలో శివుడిని ధ్యానించాలి. క్రమం తప్పకుండా ఎర్రటి పువ్వులు, పాలు, కుంకుమను ఒక గ్లాసు నీటిలో శివలింగానికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. 

 ప్రేమను గెలవడానికి: మీరు ఎవరికైనా మీ ప్రేమను వ్యక్త పరచ బోతున్నట్లయితే.. బుధవారం చాలా మంచిది. అయితే మీ ప్రేమను వారికి చెప్పబోయే ముందు తెల్లటి పువ్వులు తీసుకు వెళ్లండి. వాటిని ఇచ్చి ప్రపోజ్ చేయండి.  ఇది మీ ప్రేమను కచ్చితంగా గెలిపిస్తుంది. మీ మాటలను పూర్తి నమ్మకంతో, నిజాయితీతో చెప్తే వారు కచ్చితంగా ఓకే చెప్తారు.

 ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటే: ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు, వివాహానికి అడ్డంకులు ఎదుర్కునేవారు శ్రావణ మాసంలో ప్రతి సోమవారం భోలోనాథ్‌ను పూజించాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో గంగాజలం, చిటికెడు పసుపు వేయాలి. స్నానం చేసేటప్పుడు 'ఓం నమః శివాయ' అని జపించండి. 

 పెళ్లి చేసుకోవడానికి: పెళ్లికాని జంటలు శ్రావణ మాసంలో సోమవారం నాడు శివపార్వతులను కలిసి పూజించాలి. దీని ద్వారా వివాహానికి ఒక శుభ సమావేశం ఏర్పడుతుంది. అలాగే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  ప్రేమజంటల పెళ్లి కోసం ఒకరినొకరు వివాహం చేసుకోవాలనుకునే వారు సోమవారం ఏదైనా దేవాలయంలో శివలింగానికి జలాభిషేకం చేయాలి. దీనితో పాటు 108 తమలపాకులపై  జై శ్రీరామ్ అని రాసి శివునికి సమర్పించండి. ఈ పరిహారం వివాహానికి మంగళకరమైనదని పండితులు చెబుతున్నారు. 

 వైవాహిక సమస్యల నుండి బయటపడటానికి: శ్రావణ మాసంలో ప్రతి సోమవారం పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పసుపు లేదా తెలుపు బట్టలు ధరించాలి. ఆ తర్వాత చెప్పులు లేకుండా శివాలయానికి వెళ్లి శివుడు, గణేశుడు, పార్వతి దేవి, నంది మరియు కార్తికేయలను పూజించాలి. ఇలా చేయడం వల్ల వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి