వ్యక్తిగత కక్షతో పంటపై గడ్డిమందు స్ప్రే

వ్యక్తిగత కక్షతో పంటపై గడ్డిమందు స్ప్రే
  •  3 ఎకరాల్లో దెబ్బతిన్న వరి, మక్కజొన్న

హసన్‌‌‌‌‌‌‌‌పర్తి, వెలుగు : వ్యక్తిగత కక్షతో ఓ రైతుకు చెందిన వరి, మక్కజొన్న పంటలపై నలుగురు వ్యక్తులు గడ్డిమందు స్ర్పే చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్‌‌‌‌‌‌‌‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన కేతపాక ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ మూడు ఎకరాల్లో వరి, మక్కజొన్న సాగు చేశాడు. ప్రభాకర్‌‌‌‌‌‌‌‌కు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన కేతపాక రవి, భగత్, రాకేశ్‌‌‌‌‌‌‌‌వర్మ, సంపూర్ణతో భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. 

గురువారం నలుగురు కలిసి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌కు చెందిన పంటపై గడ్డి మందు స్ర్పే చేశారు. దీంతో పంట పూర్తిగా దెబ్బతినగా, రూ. 4 లక్షల నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గడ్డి మందు స్ర్పే చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హసన్‌‌‌‌‌‌‌‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.