మిల్కాసింగ్‌ పేరుతో స్పోర్ట్స్‌ వర్శిటీలో ఓ శాఖ

మిల్కాసింగ్‌ పేరుతో స్పోర్ట్స్‌ వర్శిటీలో ఓ శాఖ

కరోనా బారిన పడి చనిపోయిన భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ గౌరవార్థం.. పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రీడా దిగ్గజం పేరుతో పటియాలాలోని స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో ఓ శాఖను ఏర్పాటు చేయనున్నట్టు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు. శనివారం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రానా గుర్మిత్‌సింగ్‌తో కలిసి అమరీందర్‌ సింగ్‌ మిల్కా సింగ్‌ నివాసానికి వెళ్లారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. మిల్కా సింగ్‌ తనయుడు జీవ్, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
మే 20న కరోనా బారిన పడిన 91 ఏళ్ల మిల్కా సింగ్.. వైరస్‌తో పోరాడుతూ నిన్న(శుక్రవారం) రాత్రి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.