విజయవాడ-హైదరాబాద్ మధ్య స్పైస్‌జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు

విజయవాడ-హైదరాబాద్ మధ్య స్పైస్‌జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు
సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకే 10-31 మధ్య ప్రతి రోజూ సర్వీసులు 11-28 మధ్య మరో కొత్త సర్వీసు విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీని తట్టుకునేందుకు విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు నడపాలని చవక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పైస్ జెట్ ప్రకటించింది. పదో తేదీ నుంచి 31 వరకు ప్రతి రోజు సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌లో విమానం బయలుదేరి ఐదున్నర గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అదే విమానం తిరిగి ఆరు గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 7.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. 11వ తేదీ నుంచి 28 వరకు మరో కొత్త సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ఈ విమానం విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి 4.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈనెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మరో విమాన సర్వీసు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఇది మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడలో బయలుదేరి 3.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని స్పైస్‌జెట్ తెలిపింది. for more News.. కరోనా లాక్‌డౌన్‌ టైమ్​ కుటుంబాలకు మేలే చేసింది హైదరాబాద్‌లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్