గన్తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

గన్ తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలో ద్వారక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఐవోబీ బ్యాంకులో గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న శంకర్ రావు తన గన్ తో కాల్చుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం తెల్లవారుజామున విధులకు హాజరైన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

 సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన కానిస్టేబుల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శంకర్ రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. ఆత్మహత్యకు, కుటుంబ కలహాలు కారణమా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.