సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?​

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ (రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదికన సీబీఐ శాఖల్లో 253 స్పెషలిస్ట్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ పోస్టుల భర్తీకి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్‌‌‌‌‌‌‌‌, ఎంసీఏ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు పోస్టులను బట్టి 23 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. 

సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాం టెస్ట్/ సినారియో బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో డిసెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్​లైన్​ పరీక్ష డిసెంబర్​ 14న నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు జనవరి రెండోవారంలో ఉంటుంది. అప్లికేషన్​ ఫీజు రూ.850, జీఎస్‌‌‌‌‌‌‌‌టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, జీఎస్‌‌‌‌‌‌‌‌టీ) చెల్లించాలి. పూర్తి వివరాలకు www.centralbankofindia.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.