ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. హోలీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు పలు రైళ్లను నడపనుంది. మొత్తం 18 ప్రత్యేక రైళ్ల సేవలు(Special Trains 2024) అందించనున్నాయి. మార్చి 16వ తేదీ నుంచి ఈ స్పెషల్ ట్రైన్స్…. అందుబాటులోకి వస్తాయని దక్షిమ మధ్య రైల్వే(South Central Railway) తెలిపింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు
- సికింద్రాబాద్ - గోమతి నగర్
- గోమతి నగర్ - సికింద్రాబాద్
- సంత్రగాచి - సికింద్రాబాద్
- సికింద్రాబాద్ - షాలిమార్
- షాలిమార్ - సికింద్రాబాద్
- కాచిగూడ - లాల్ ఘర్
- లాల్ ఘర్ - కాచిగూడ
- సికింద్రాబాద్ - దర్బాంగా
- దర్బాంగా - సికింద్రాబాద్
- హైదరాబాద్ - పాట్నా
- పాట్నా - హైదరాబాద్
- పాట్నా - రక్సాల్
- కాచిగూడ - రక్సాల్
- రక్సాల్ - కాచిగూడ
రెండు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లకు 18 కొత్త స్టాపేజీలను ప్రకటించింది. ఫలితంగా ఆయా స్టేషన్లలో మరికొన్ని రైళ్లు ఆగనున్నాయి. ఇందులో తెలంగాణలోని 10 స్టేషన్లలో(Trains Additional Stoppages in Telangana) పలు రైళ్లు ఆగనుండగా… మిగతావి ఏపీలో(Trains Additional Stoppages in AP) ఆగుతాయి. ఇందుకు సంబంధించిన స్టాపేజీలకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సేవలు ప్రారంభమయ్యే తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
రైళ్ల వివరాలు - కొత్త స్టాపేజీలు
- రామేశ్వరం - భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ - రాజమండ్రి రైల్వే స్టేషన్.
- హౌరా - పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ - రాజమండ్రి స్టేషన్.
- హుబ్లీ - మైసూర్ - హంపి ఎక్స్ ప్రెస్ - అనంతపురం స్టేషన్.
- సికింద్రాబాద్ రేపల్లె ఎక్స్ ప్రెస్ - సిరిపురం.
- కాజీపేట -బలార్ష ఎక్స్ ప్రెస్ - రాఘవపురం.
- కాజీపేట - బలార్ష ఎక్స్ ప్రెస్ - మందమర్రి స్టేషన్.
- పూణె - కాజీపేట ఎక్స్ ప్రెస్ - మంచిర్యాల.
- దౌండ్ - నిజామాబాద్ ఎక్స్ ప్రెస్ - నవీపేట్.
- తిరుపతి - ఆదిలాబాద్ - కృష్ణా ఎక్స్ ప్రెస్ - మేడ్చల్ స్టేషన్.
- భద్రాచలం - సింగరేణి ఎక్స్ ప్రెస్ - బేతంపూడి స్టేషన్.
- నర్సాపూర్ - నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ - మహబూబాబాద్ స్టేషన్.
- సికింద్రాబాద్ - తిరుపతి - వందేభారత్ ఎక్స్ ప్రెస్ - మిర్యాలగూడ స్టేషన్.
- సికింద్రాబాద్ - భద్రాచలం - కాకతీయ ఎక్స్ ప్రెస్ - తడకలపుడి.
- రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ - రామన్నపేట.
- గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ - ఉంద నగర్.
- కాజీపేట్ - బలార్ష ఎక్స్ ప్రెస్ - Rechni Road, తాండూరు.
- తిరుపతి - సికింద్రాబాద్ - పద్మావతి ఎక్స్ ప్రెస్ - నెక్కొండ స్టేషన్.
- భద్రాచలం రోడ్డు - సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ ప్రెస్ - బేతంపుడి.