గుడ్ న్యూస్: సికింద్రాబాద్ టు లక్నో స్పెషల్ రైలు షురూ..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. సికింద్రాబాద్ నుంచి లక్నో వరకు స్పెషల్ రైలు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ ( నవంబర్ 15, 2024 ), శుక్రవారం ( నవంబర్ 22, 2024 ) ఈ స్పెషల్ సర్వీసును నడపనున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. ఈ స్పెషల్ ట్రైన్ ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగనుందని తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సర్వీసును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది రైల్వే శాఖ.

సికింద్రాబాద్ నుండి లక్నో వరకు నడవనున్న ఈ స్పెషల్ రైలు ( నంబర్ 07084 ) నవంబర్ 15 ( శుక్రవారం ) రాత్రి 7: 05 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి.. ఆదివారం ( నవంబర్ 17, 2024 ) సాయంత్రం 6గంటలకు లక్నో చేరుతుందని తెలిపింది రైల్వే శాఖ. మరో పక్క , ఇదే సర్వీసు నవంబర్ 18, 25 తేదీల్లో లక్నో నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరుతుందని.. సోమవారం ( నవంబర్ 18, 2024 ) ఉదయం 9: 50గంటలకు లక్నో నుంచి బయలుదేరి నవంబర్ 20 ( బుధవారం ) సాయంత్రం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని తెలిపింది రైల్వే శాఖ.

సికింద్రాబాద్, లక్నో మధ్య నడిచే ఈ స్పెషల్ సర్వీసు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, గయా, వారణాసి, అయోధ్య స్టేషన్లల్లో ఆగుతుందని... ఈ రైళ్లల్లో 3 ఏసీ కోచ్ లు ఉంటాయని తెలిపింది రైల్వే శాఖ.