కుంభమేళా 2025: సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్ ..IRCTC 8 రోజుల టూర్.. ప్యాకేజీ వివరాలు ఇవే

తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లాలనుకునే వారు IRCTC  గుడ్ న్యూస్ తెలిపింది.  ఇప్పటికే ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.  గంగా.. యమునా.. సరస్వతి నదులు కలిసే ప్రదేశంలో స్నానం చేస్తే జన్మ .. జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని హిందువులు నమ్ముతుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి  కుంభమేళాకు వెళ్లే భక్తులకు IRCTC ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టింది.

కుంభమేళా టూర్ ప్యాకేజీలో  8 రోజుల (  7 రాత్రులు)  పర్యటనలో మూడు పుణ్య క్షేత్రాలను సందర్శించుకోవచ్చు.  సికింద్రాబాద్ నుంచి బయలు దేరే ఈరైలు తెలుగు రాష్ట్రాల మీదుగా కాశీ.. అయోధ్య.. ప్రయాగ్ రాజ్ వెళ్తుంది. జనవరి 19 తేదీన సికింద్రాబాద్ లో ఈ ట్రైన్ ప్రారంభమవుతుంది.  ఈ ట్రైన్ లో మొత్తం 576 సీట్లు ఉండగా వాటిలో స్లీపర్ 320.. థర్డ్ ఏసీ 206.. సెకండ్ ఏసీ 50 ఉన్నాయి. సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో బోర్డింగ్.. డీబోర్డింగ్ కు అవకాశం ఉంటుంది. 

ప్యాకేజీ వివరాలు ఇలా..( ఒక్కొక్కరికి) 

  • స్లీపర్ క్లాస్ .. రూ. 22, 635 ( పెద్దలకు)
  • స్లీపర్ క్లాస్ .. రూ. 21, 740 ( పిల్లలకు )
  • థర్డ్ ఏసీ...రూ. 31,145(పెద్దలకు)
  • థర్డ్ ఏసీ...రూ. 30,095( పిల్లలకు)
  • సెకండ్ ఏసీ...రూ 38,195(పెద్దలకు)
  • సెకండ్ ఏసీ...రూ 36,935(పిల్లలకు)

2025 జనవరి 19 న సికింద్రాబాద్ నుంచి బయలు దేరిన ఈ ట్రైన్ .. జనవరి 21 వ తేదీన వారణాసి లోని బనారస్ చేరుకుంటుంది.  అక్కడ భోజనం చేసి గంగా హారతికి వెళతారు.  ఆ తరువాత ఆ రోజు అక్కడ విశ్రాంతి తీసుకొని జనవరి 22 వతేదీన రోడ్డు మార్గంలో 120 కిలో మీటర్లు ప్రయాణించి ప్రయాగ్ రాజ్ చేరుకుంటారు.  అక్కడ టెంట్ సిటీలో స్టే చేసి.. భోజనం చేసి కుంభమేళాకు వెళతారు. పుణ్యస్నానం ఆచరించి.. అక్కడ చూడాల్సిన ప్రదేశాలను సందర్శించి.. టెంపుల్ సిటీలో జనవరి 22 వ తేదీ రాత్రి బస చేస్తారు.

ALSO READ | రేవంత్ రెడ్డి గట్స్ ఉన్న సీఎం.. అందుకే హీరోను అరెస్ట్ చేయగలిగారు : పవన్ కల్యాణ్
  
జనవరి 23 వ తేదీన రోడ్డు మార్గంలో కాశీ( వారణాసి)కి వెళ్తారు.   కాశీ విశ్వనాథ దేవాలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాన్ని సందర్శించి .. ఆరోజు రాత్రి అక్కడే ఉంటారు.  ఇక అక్కడి నుంచి జనవరి 24వ తేదీ అయోధ్యకు  వెళ్లి  శ్రీ రామజన్మ భూమి, హనుమాన్ గర్హిని సందర్శిస్తారు.  అదే రోజు అనగా జనవరి 24 వతేదీ రాత్రి 10 గంటలకు అయోధ్య నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 25 వ తేదీ అంతా ట్రైన్ లో ప్రయాణించి 26 వ తేదీకి మరల సికింద్రాబాద్ చేరుకుంటారు.