అలంపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు 

అలంపూర్, వెలుగు: ఐదో శక్తిపీఠం అయిన  శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా గురువారం చండీహోమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే  సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో అలంపూర్‌‌‌‌ ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. గణపతి పూజ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం  శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన చండీహోమంలో 114 మంది భక్తులు పాల్గొన్నట్లు ఈవో పురేందర్ కుమార్ తెలిపారు.