108  కలశాలతో శివలింగానికి అభిషేకం

 కౌడిపల్లి, వెలుగు: కార్తీక మాసం సందర్భంగా సోమవారం మండల కేంద్రమైన కౌడిపల్లి పరిధి బతుకమ్మ తండాలోని ఆదిలక్ష్మి ఆశ్రమంలో శివలింగానికి 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. కౌడిపల్లి అభయ రామాలయంలో 108 కలశాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహిళలు కాలినడకన మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలక్ష్మి ఆశ్రమానికి చేరుకుని శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఆరేళ్లుగా మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన  రమా, ప్రతాపరెడ్డి దంపతులు గంగా, యమునా, గోదావరి తదితర ఏడు నదుల జలాలు తీసుకువచ్చి కలశాల పూజ నిర్వహిస్తున్నారు