జగన్ పై దాడి కేసులో సిట్ ఏర్పాటు..

జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఈసీతో భేటీ అయ్యారు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మల్లాది విష్ణు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలని కోరారు. చంద్రబాబు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకట్ట వేయాలని ఈసీని కోరామన్నారు సజ్జల. ఒకవైపు ఈ దాడిని ఖండిస్తూనే చంద్రబాబు టీడీపీ నేతలతో డ్రామా అంటూ విమర్శలు చేయిస్తున్నారని మండి పడ్డారు సజ్జల.

ఈ ఘటనపై ఇప్పటికే ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఎస్పీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఈసీ కీలక నేతల సభల్లో భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసింది.