అమరావతి : రాష్ట్రంలో మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో పనిచేయనున్న ఈ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే.. దాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. ఐజి.. లేదా అంతకంటే పైస్థాయి అధికారిని ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కమిషనర్‌గా ప్రభుత్వం నియమించనున్నది. మొత్తం 18 పోలీస్ యూనిట్లలో అడిషనల్ ఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించబోతున్నట్లు సమాచారం. 18 మంది సభ్యులు గల ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోలో ఏడుగురు ఐపిఎస్ అధికారులు పని చేయబోతున్నారు. శనివారం సాయంత్రం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
