చెంచులకు ప్రత్యేక ఆధార్‌‌‌‌‌‌‌‌ శిబిరం

  • మొదటి రోజు 500 మంది హాజరు
  • టెక్నికల్‌‌‌‌‌‌‌‌ సమస్యల కారణంగా సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం
  • మూడు రోజుల పాటు కొనసాగనున్న క్యాంప్ 

అమ్రాబాద్, వెలుగు : నల్లమల ఏజెన్సీ ఏరియాలోని చెంచులకు ఆధార్, రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులతో పాటు బర్త్, ఇతర సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ బడావత్‌‌‌‌‌‌‌‌ సంతోష్‌‌‌‌‌‌‌‌ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఐటీడీఏ కలిసి గురువారం ప్రత్యేక క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. మొదటి రోజు జరిగిన క్యాంప్‌‌‌‌‌‌‌‌కు లింగాల, బల్మూర్‌‌‌‌‌‌‌‌ మండలాలకు చెందిన సుమారు 500 మంది చెంచులు హాజరయ్యారు. వారికి ఆర్డిటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రవాణా, వసతి కల్పించి ఆదివాసీ భవనంలో బస ఏర్పాటు చేశారు. 

కొందరు చిన్నారులు, స్టూడెంట్లకు బర్త్‌‌‌‌‌‌‌‌, క్యాస్ట్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లు లేకపోవడంతో ఆర్డీవో మాధవి క్యాంప్‌‌‌‌‌‌‌‌ వద్దే అప్పటికప్పుడు సర్టిఫికెట్లు జారీ చేశారు. రెండు మీసేవ కేంద్రాలు, రెండు ఆధార్ కేంద్రాల సిబ్బందితో  ఆర్డీటీ, రెవెన్యూ, ఐటీడీఏ సిబ్బంది చెంచులకు అప్లికేషన్లు పూర్తి చేసి ఇచ్చారు. సర్వర్, టెక్నికల్‌‌‌‌‌‌‌‌ సమస్యలు తలెత్తడంతో 15 బర్త్, 13 క్యాస్ట్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లు మాత్రమే జారీ కాగా, 25 మందికి ఆధార్ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌, న్యూ ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేశారు. మొదటి రోజు సాంకేతిక సమస్యలతో  కొంత మందికి మాత్రమే సర్టిఫికెట్లు జారీ అయ్యాయని, క్యాంప్‌‌‌‌‌‌‌‌ను శనివారం వరకు కొనసాగించనున్నట్లు ఆర్డీవో మాధవి తెలిపారు.