సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించిన స్పీకర్

రామచంద్రాపురం, వెలుగు : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని గురువారం స్పీకర్​గడ్డం ప్రసాద్​రావు సందర్శించారు. అనంతరం ఆశ్రమ ఆవరణలోని పంచముఖ హనుమాన్​ ఆలయంలో పూజలు నిర్వహించారు.

ఆర్డీ వో రాజు, తహసీల్దార్ సంగ్రామ్​రెడ్డి, ఆశ్రమ ట్రస్ట్​ సభ్యులు స్పీకర్​కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సచ్చిదానంద స్వామిజీ  స్పీకర్​ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.