ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లెటర్లనూ పరిగణనలోకి తీసుకోండి : స్పీకర్​గడ్డం ప్రసాద్

వికారాబాద్, వెలుగు: తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందున తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలనూ పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ కొత్త చైర్మన్ బీఆర్ నాయుడిని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలో ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. తొలుత స్పీకర్ చాంబర్​కు వచ్చిన ఆయనకు లెజిస్లేచర్ సెక్రటరీ డా.వి నరసింహాచార్యులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, లెజిస్లేచర్ అధికారులు ఉన్నారు.