‘స్పేస్ఎక్స్’ చేపట్టిన ఓ భారీ ప్రయోగం ఫెయిలైంది. ఆస్ట్రోనాట్లను, స్పేస్ టూరిస్టులను చంద్రుడు, అంగారకుడిపైకి తీసుకెళ్లేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్పేస్ఎక్స్’ కంపెనీ అభివృద్ధి చేసిన భారీ రాకెట్ ‘స్టార్‌షిప్’.. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే పేలిపోయింది. గురువారం ఉదయం అమెరికాలోని టెక్సాస్‌లో బోకాచికా సముద్ర తీరంలో ఉన్న స్పేస్ఎక్స్ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్రయోగించారు. రాకెట్‌కు అమర్చిన 33 రాప్టర్ ఇంజన్లలో 5 పనిచేయకపోవడం వల్లే ప్రయోగం ఫెయిలైందని సైంటిస్టులు తెలిపారు. ‘స్టార్‌షిప్’ కోసం స్పేస్ఎక్స్ కంపెనీ దాదాపు రూ.16 వేల కోట్లకుపైనే ఖర్చు చేసింది. దీని బరువు 5 వేల టన్నులు. ఎత్తు 120 మీటర్లు.33 రాప్టర్ ఇంజన్లలో 5 పనిచేయలేదని వెల్లడిస్పేస్ ఎక్స్ టీమ్‌కు అభినందనలు.. ఎంతో నేర్చుకున్నాం : మస్క్
వాషింగ్టన్: ఆస్ట్రోనాట్లను, స్పేస్ టూరిస్టులను మూన్, మార్స్ పైకి తీసుకెళ్లేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్పేస్ఎక్స్’ కంపెనీఅభివృద్ధిచేసిన ప్రపంచంలోనే భారీ రాకెట్ ‘స్టార్‌షిప్’ తొలి ప్రయోగం విఫలమైంది. గురువారం ఉదయం అమెరికాలోని టెక్సాస్‌లో బోకాచికా తీరంలో ఉన్న స్పేస్ఎక్స్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే కొన్ని నిమిషాల్లోనే గాల్లో పేలిపోయింది. ఈ రాకెట్లో బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్ అనే రెండు ప్రధాన సెక్షన్లు ప్రయోగించిన 3 నిమిషాల్లోగా విడిపోవాలి. కానీ అలా జరగకుండా రాకెట్ పేలిపోయింది. స్టార్ షిప్ రాకెట్ నింగిలోకి వెళ్లే క్రమంలో.. అందులోని 33 రాప్టర్ ఇంజన్లలో కనీసం 5 పనిచేయలేదని అంటున్నారు. ఇక ప్రయోగం ఫెయిలైన వెంటనే స్పేస్ఎక్స్ యజమాని మస్క్ ట్వీట్ చేశారు. ‘‘స్పేస్ ఎక్స్ టీమ్‌కు అభినందనలు. ఇంకొన్ని నెలల్లో జరగబోయే తదుపరి టెస్ట్ లాంచ్ కోసం ఈ ప్రయోగం నుంచి చాలా నేర్చుకున్నాం” అని పేర్కొన్నారు.
స్టార్‌షిప్ విశేషాలు
- ‘స్టార్‌షిప్’ను అభివృద్ధి చేయడానికి స్పేస్ఎక్స్ కంపెనీ రూ.16 వేల కోట్లకుపైనే ఖర్చయింది.
- రాకెట్ ఎత్తు 120 మీటర్లు (394 అడుగుల) ఉంటుంది.
- 100 టన్నుల బరువును మోసుకెళ్లగలదు.
- స్టార్‌షిప్ అనేది రీయూజబుల్ రాకెట్.
- 2025లో చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్లను పంపే ‘ఆర్టెమిస్’ ప్రాజెక్టుకు ‘స్టార్ షిప్’ రాకెట్ నే నాసా వాడనుంది.
- స్టార్‌షిప్ కోసం రూ.23 వేల కోట్ల భారీ కాంట్రాక్టును 2021 ఏప్రిల్‌లోనే స్పేస్ ఎక్స్‌కు నాసా కేటాయించింది.
