2050 నాటికి అంతరిక్షానికి స్పేస్​ ఎలివేటర్​

ఒబాయాషి కార్పొరేషన్​ అనే జపాన్​ సంస్థ భూమిపై నుంచి అంతరిక్షానికి స్పేస్​ ఎలివేటర్​ను 2050 నాటికి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం అంతరిక్షానికి వ్యోమగాములను, ఉపగ్రహాలను పంపేందుకు ఉపయోగిస్తున్న వాహక నౌకల అవసరం లేకుండా స్పేస్​ ఎలివేటర్లతో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్​ క్లెంబర్ల ద్వారా అంతరిక్షానికి పంపించవచ్చు. సోలార్, మైక్రోవేవ్​ ఎనర్జీ ద్వారా ఈ స్పేస్​ ఎలివేటర్లు పనిచేస్తాయి. 

ప్రయోజనాలు 

  • ఒబాయాషి సంస్థ ప్రకారం రాకెట్లను పంపించేందుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే 90 శాతం తక్కువ ఖర్చుతో వ్యోమగాములను, వస్తువులను కక్ష్యలోకి పంపేందుకు వీలు కలుగుతుంది. ఒక కిలో పేలోడ్​ను పంపించడానికి కేవలం రూ.2వేలు ఖర్చు అవుతుంది. 
  • స్పేస్​ ఎలివేటర్​ కోసం కార్బన్ నానోట్యూబ్​లను ఉపయోంచి కేబుల్​(తెథెర్)ను ఈ సంస్థ 
  • నిర్మించనున్నది. 
  • స్పేస్​ ఎలివేటర్​ నిర్మాణం పూర్తయితే అంతరిక్ష పర్యాటకానికి అవకాశం కలుగుతుందని, అంతరిక్ష మైనింగ్​ సులువు అవుతుందని ఈ సంస్థ అంచనా వేస్తున్నది.  అంతేకాకుండా రాకెట్లలా ఈ స్పేస్​ ఎలివేటర్లు కాలుష్యానికి 
  • కారణం కాబోవు.