–ఇస్రో చేపట్టిన చంద్రయాన్ – 3 ప్రాజెక్టుకు అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఈ ఏడాది అక్టోబర్ 14న ఇటలీలోని మిలాన్‌లో జరుగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రానాటికల్ కాన్ఫరెన్స్‌ను పురస్కరించుకొని అందజేయనున్నారు.
2023, ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను భారత్ విజయవంతంగా ఇస్రో ల్యాండింగ్ చేసింది. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుడిపై కాలు పెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటివరకు ఏ దేశం వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది.
రెండు వారాల పరిశోధనలు సాగించేలా వీలుగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను ఇస్రో రూపొందించిది.
విక్రమ్ ల్యాండ్ అయిన తర్వాత లోపలి నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడ సమాచారాన్ని సేకరించింది. ఆ తర్వాత ల్యాండర్, రోవర్లు స్లీప్ మోడ్‌లోకి వెళ్లాయి.
రెండు వారాల తర్వాత మేల్కొలిపేందుకు ఇస్రో ప్రయత్నం చేసినా ఫలించలేదు. దాంతో అవి శాశ్వత నిద్రలోకి వెళ్లినట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు.
ఇస్రో చంద్రయాన్–4 ప్రయోగానికి ప్రణాళికలు రచిస్తున్నది. ఈ మిషన్‌లో చంద్రుడిపై నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి చేరుకోనున్నది. ఈ మిషన్‌ను 2026 నాటికి నిర్వహించాలని ఇస్రో భావిస్తున్నది.