జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టాలి : యోగేశ్​​గౌతమ్

నారాయణపేట, వెలుగు: బాల్య వివాహాలు లేని జిల్లాగా మార్చాలని ఎస్పీ యోగేశ్​​గౌతమ్​ సూచించారు. గురువారం ఎస్పీ ఆఫీస్​లోని కాన్ఫరెన్స్ హాల్​లో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిపించినా, సహకరించినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

బాల్య వివాహం చేసుకుంటే పాక్సో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే బడి బయట ఉన్న పిల్లలను స్కూళ్లలో చేర్పించేందుకు పేరెంట్స్​కు కౌన్సిలింగ్  ఇవ్వాలన్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్​ అశోక్  శ్యామల, లేబర్​ ఆఫీసర్​ రాజ్​కుమార్, జీసీడీవో పద్మ నళిని పాల్గొన్నారు.