ప్రతి సర్కిల్​లో సీసీ కెమెరాలు ఉండాలి :ఎస్పీ ఉదయ్ కుమార్

నర్సాపూర్, వెలుగు: ప్రతి సర్కిల్​లో సీసీ కెమెరాలు ఉంటే నేరాల నియంత్రణ, ఎంక్వయిరీ స్పీడ్ అవుతుందని ఎస్పీ ఉదయ్ కుమార్ సూచించారు. శనివారం నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచెడ్ పీఎస్​ల క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పలు కేసుల ఫైళ్లను పరిశీలించారు. గణేశ్ నిమజ్జనాలు పీస్ ఫుల్ గా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్  సిగ్నల్స్ పనిచేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐలు లింగం, రంజిత్ కుమార్, ఏఎస్ఐ మిస్బావుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.