మెదక్ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి 47 మంది బాలకార్మికులను విముక్తుల్ని చేశామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తన కార్యాలయంలో మాట్లాడుతూ... చాలా కుటుంబాల్లో పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారన్నారు. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన వారు పనిలో ఉంటున్నారని తెలిపారు.
ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన ఆపరేషన్లో దుకాణాలు, మెకానిక్ షాపుల్లో, హోటళ్లలో పనిచేస్తున్న వారని గుర్తిచి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరించారు. బాలకార్మికులను ఎవరైన గుర్తిస్తే 1098, డయల్ 100, 112 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.