పోలీసు సిబ్బందికి కిట్ల పంపిణీ చేసిన ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి

మెదక్​టౌన్, వెలుగు: క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్​ఆఫీసులో  పోలీసులకు చలికాలం కిట్లను పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చలికాలం దృష్టిలో పెట్టుకుని స్వెట్టర్​, బ్లాంకెట్, మస్కిటో నెట్, టీ షర్టులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగనాయక్, ఆర్ఐలు శైలేందర్, నరేశ్, రాములు పాల్గొన్నారు.