సైబర్ క్రైమ్ బాధితుల డబ్బు రికవరీ చేయాలి

గద్వాల, వెలుగు: జిల్లాలో సైబర్ క్రైమ్ బాధితులు కోల్పోయిన డబ్బును రికవరీ చేసి వారికి అందించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ఎస్పీ ఆఫీసులో గురువారం జిల్లా క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పాత నేరస్తులపై నిఘా పెట్టాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రివేళ గస్తీ పెంచాలన్నారు. ప్రతి కేసును క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలన్నారు.

ఉమెన్ మిస్సింగ్ కేసులను త్వరగా ఛేదించాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను క్లియర్ చేయాలని ఆదేశించారు. డీఎస్పీ సత్యనారాయణ, సైబర్ క్రైం డీఎస్పీ సత్తయ్య, సీఐ రవిబాబు, టాటా బాబు, నాగేశ్వర్ రెడ్డి ఉ